అప్పు దొరికే ఛాన్సు కూడా లేకపోయే… జగన్ ప్రభుత్వం కొత్త ఇబ్బందులు

YS Jagan Amaravatiతీవ్ర ఆర్ధిక సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుంది. ఏడాది కాలంలో తీసుకోడానికి అనుమతించిన అప్పులను రాష్ట్ర ప్రభుత్వం కేవలం సగం సంవత్సరం కూడా కాకుండా పూర్తి చెయ్యడంతో అప్పుల కోసం కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు 20000 కోట్లు అప్పు తెచ్చుకోవచ్చు, అయితే ఇప్పటికే అది అయిపోయింది.

ADVERTISEMENT

ఇంకో 6000 కోట్ల అప్పుకు అవకాశం ఉన్నా ఈ ఏడాది చివరి త్రైమాసికం వరకూ అది తీసుకోవడం వీలు లేదు. దీనితో చట్ట సవరణ ద్వారా అప్పులు పెంచుకునే ఎఫ్ఆర్బీఎం లిమిట్ ని 3% నుండి 5% కు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కేబినెట్ సమావేశం లేకుండా అందుబాటులో ఉన్న మంత్రుల సంతకాలతో గవర్నర్ కు చట్ట సవరణ దస్త్రం పంపారు.

కరోనా వల్ల అతలాకుతలమైన పరిస్థితుల్లో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని 5 శాతానికి పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో 0.5 శాతానికి సమానమైన రుణ మొత్తాన్ని ఏ నిబంధనలూ లేకుండా వాడుకోవచ్చు. మరో 1.5 శాతం పరిమితిని వినియోగించుకోవాలంటే కొన్ని షరతులు విధించింది.

‘ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డు అమలు’, విద్యుత్తు రాయితీల మొత్తం నేరుగా రైతులకు ఇచ్చి వారి నుంచి బిల్లులకు తగ్గట్టుగా వసూలు చేయడం వంటి మూడు షరతులు ప్రతిపాదించింది. ఈ షరతుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి… అయితే వీటిని ఒప్పుకోకతప్పని పరిస్థితి. ఈ దస్త్రం ఆమోదం పొందితేనే వచ్చే నెలలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories