ప్రభాస్ అభిమానుల తీరని కోరిక ఇప్పుడు తీరనుందా?

Prabhas Fans happy with Salaar shootingయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం, సలార్ మొన్న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివరిలో ప్రారంభమవుతుంది. అయితే ప్రభాస్ ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రమే జట్టులో చేరనున్నారు. ఈ చిత్రం కోసం ప్రభాస్ విరామం లేకుండా షూట్ చేయనున్నారు.

ADVERTISEMENT

ప్రభాస్ కోసమని సలార్ షూట్ మొత్తం హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. ఈ ఏడాది దసరా కు విడుదల చెయ్యాలని వారి ఆలోచనగా ఉంది. అయితే రాధే శ్యామ్ విడుదల తేదీని ప్రకటించాకా దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చు. ఒకవేళ అదే జరిగితే ప్రభాస్ అభిమానులకు ఒకే ఏడాది రెండు సినిమాలు చూసే అవకాశం దక్కుతుంది.

2009 తరువాత ప్రభాస్ నుండి ఒకే ఏడాది రెండు సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. బాహుబలి నుండి అయితే అసలు అటువంటి సమస్యే లేదు. ఇప్పుడు కరోనా కారణంగా అది సాధ్యపడే అవకాశం ఉండవచ్చు. ప్రభాస్ మరో సినిమా ఆదిపురుష్ కూడా ఈ ఏడాదే అంటున్నారు గానీ అది అనుమానమే అని చెప్పుకోవాలి.

ఈ చిత్రంలో దిషా పటాని మెయిన్ హీరోయిన్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆమె గతంలో వరుణ్ తేజ్ లోఫర్ తో తెలుగు అరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్..కాల్డ్ వన్ మ్యాన్ .. మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రం నీల్ శైలిలో మాస్ మసాలా ఎంటర్టైనర్ కానుందని సూచిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories