
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ కంపెనీలు కలిసి రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోకే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాయి. దీని కోసం ప్రభుత్వం 5300 ఎకరాలు భూమి కేటాయించగా తోలి దశలో 2,000 ఎకరాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోంది. ప్రభుత్వం తరపున దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. భూసేకరణ, నిర్వాసితులకు చెల్లింపులు అన్నీ సజావుగా పూర్తయ్యాయి.
కనుక ఈ నెల 23న దీనికి సిఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాబోతున్నట్లు సమాచారం. కనుక భూమిపూజ చేయబోయే ప్రాంతాన్ని చదును చేసి తాత్కాలిక హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ సమీపంలోనే బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఏర్పాటవుతోంది. కనుక కాగిత వద్ద జాతీయ రహదారి నుంచి వాటి వరకు తాత్కాలికంగా విశాలమైన రోడ్లు నిర్మిస్తున్నారు.
ఈ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్ విదేశాలకు ఎగుమతి అవుతుంది. అలాగే భారత్‌లో వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ముడి ఇనుము, బొగ్గు కూడా దిగుమతి అవుతుంది. బల్క్ డ్రగ్ సంస్థలకు కూడా భారీగా ఎగుమతులు, దిగుమతులు ఉంటాయి. కనుక వీటన్నిటి కోసం ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ కంపెనీలే నక్కపల్లికి సమీపంలోనే ఒక భారీ పోర్టు కూడా నిర్మించబోతున్నాయి.
కనుక ఈ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కు, పోర్టు మూడు నిర్మాణాలు పూర్తిచేసుకొని కార్యకలాపాలు మొదలుపెడితే వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. అనకాపల్లి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో రియల్ ఎస్టేట్, రవాణా, హోటల్, వినోదం తదితర రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. వీటన్నిటితో ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తుంది. సంపద సృష్టించడం అంటే ఇదేగా?
Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…
November 20 could witness an interesting box-office battle, with Mammootty and Dulquer Salmaan finding themselves…