గిగ్ వర్కర్లకు 10 నిమిషాల ఉపశమనం… లభించేనా?

10-minute Delivery Rule

ఇటీవల క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సమయంలో దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమోటో, బ్లింకిట్ తదితర సంస్థలకు చెందిన కార్మికులు (గిగ్ వర్కర్లు) మెరుపు సమ్మె చేశారు. డెలివరీలపై కమీషన్ పెంపు, రహదారి భద్రత భీమా సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా 10 నిమిషాలలో ఫుడ్ డెలివరీ చేయాలనే నిబందన తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

వాటిలో కొన్ని డిమాండ్లకు కొన్ని సంస్థలు ఒప్పుకున్నప్పటికీ, 10 నిమిషాలలో ఫుడ్ డెలివరీని ఎత్తివేయడానికి ఇష్టపడలేదు. వాటిలో ఓ సంస్థ సీఈవో మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు ఎక్కడికక్కడ మా అవుట్ లేట్లున్నాయి. వినియోగదారు ఆర్డర్ పెట్టిన రెండు నిమిషాలలోపే మేము ఆర్డర్ ప్యాక్ చేయగలుగుతున్నాము. కనుక దానిని సమీపంలో ఉన్న వినియోగదారుకి 8 నిమిషాలలో చేర్చడం పెద్ద కష్టమని నేను భావించడం లేదు,” అని అన్నారు.

ADVERTISEMENT

కానీ ఆయన చెప్పినదానిలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఇప్పుడు చిన్న పట్టణాలు, కాలనీలలో కూడా వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. కనుక 10 నిమిషాలలో ఫుడ్ డెలివరీ చేయడం చాలా కష్టమే. కానీ కంపెనీల మద్య పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ 10 నిమిషాల ఐడియా పుట్టుకొచ్చింది. ఒకవేళ పోటీ ఇంకా పెరిగిపోతే 5 నిమిషాలో 2 నిమిషాలో చేసినా ఆశ్చర్యం లేదు.

కానీ దీంతో గిగ్ వర్కర్లు తీవ్ర ఒత్తిడికి, ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక ఈ నిబంధన ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి మన్ సుక్ మాండవీయ ఆయా సంస్థలతో మాట్లాడి ఈ నిబంధన తొలగించాలని కోరారు. ఆయన సూచనపై ఆ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. కనుక గిగ్ వర్కర్లకు 10 నిమిషాల ఉపశమనం లభించనుంది.

ADVERTISEMENT
Latest Stories