ఇది ‘స్పైడర్’ తరహా ‘గ్లిమ్స్’ కాదు!

First Glimpse of 2.0 Making Video Just Above Awesomeశంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న “రోబో 2.0”కు సంబంధించి తొలి వీడియో ప్రేక్షకులను పలకరించింది. ‘వినాయకచవితి’ పర్వదినం సందర్భంగా ‘గ్లిమ్స్ ఆఫ్ రోబో 2.0’ను విడుదల చేస్తామని చెప్పడంతో… అంతా ‘స్పైడర్’ తరహాలో ఓ చిన్న వీడియోను విడుదల చేస్తారని భావించారు. అయితే చిత్ర యూనిట్ చెప్పినట్లుగా విడుదలైంది ‘గ్లిమ్స్’ కాదు, ‘మేకింగ్’ వీడియో అన్న విషయం అవగతమైంది.

బహుశా విడుదలకు చేయడానికి ముందు ఈ వీడియోకు పేరు పెట్టడంలో తికమకపడ్డారేమో గానీ, చివరికి ‘మేకింగ్ వీడియో’గానే రిలీజ్ చేసారు. అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రూపొందించడానికి శంకర్ ఏ విధంగా కష్టపడుతున్నారు? అన్న దానికి నిదర్శనంగా ఈ వీడియో నిలుస్తోంది. స్పష్టంగా చూపించనప్పటికీ… రజనీ గెటప్ వేసుకోవడానికే చాలా సమయం పడుతుందన్న భావన ఈ ‘మేకింగ్’ ద్వారా తెలుస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories