అదీ ఒక కారణమే…కాస్త ఆలోచించి ఉంటే సరిపోయేది!

2-0-movie-collections-slows-downగత గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన రజనీకాంత్ రోబో-2.0 మంచి కలెక్షన్స్ తోనే ముందుకు సాగుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహపడనవసరం లేదు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు మాత్రం బాహుబలి సినిమాలు కొట్టే సినిమాగా ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలే వేశాయి. కానీ అనేక కారణాల నడుమ ఈ సినిమా ఆ మార్క్ ను అనుకోలేకపోయింది. ఫుల్ టైమ్ లో బాహుబలి రేంజ్ వరకూ వచ్చి నిలిచే సినిమాగా మంచి కలెక్షన్స్ ను అయితే కొల్లగొడుతుంది అని ట్రేడ్ వర్గాలు అంచ వేస్తున్నాయి.

[m9ad]

ADVERTISEMENT

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కాస్త ఆశించిన రేంజ్ ను అందుకోక పోవడానికి ఈ సినిమాని రెండు వెర్షన్స్ లో విడుదల చెయ్యడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అదే ఒకటి 3D..మరొకటి 2D…అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా 3Dలోనే చూడమంటూ ఎక్కువగా ప్రమోట్ చెయ్యడం ఒక ఎత్తు అయితే, సినిమాలో తక్కువైన ఎంటర్‌టేన్‌మెంట్ మ్యాటర్ కూడా 2D థియేటర్స్ ను ఖాళీగా ఉండేలా చేస్తుంది. ఈ క్రమంలోనే తక్కువ సంఖ్యలో ఉన్న 3D స్క్రీన్స్ ఫుల్ అవుతూ ఉండగా, ఎక్కువ సంఖ్యలో ఉన్న 2D స్క్రీన్స్ మాత్రం 50 నుంచి 60 పర్సెంట్ వరకే ఫుల్ అవుతూ పర్వాలేదు అన్న వసూళ్లు సాధిస్తున్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ తో ఇక ట్యాక్సీ వాలా బండి కి బ్రేకులు పడతాయి అని అనుకున్నారు అందరూ కట్ చేస్తే ట్యాక్సీ వాలా మెల్లగా స్పీడ్ తగ్గించుకుని, రోబో కి సైడ్ ఇచ్చేసి తన దారిలో తాను పోతున్నాడు. ఈ పుణ్యం అంతా 2D థియేటర్స్ లో రోబో సినిమాపై పడ్డ ఎఫెక్ట్ గా చెప్పవచ్చు. ఈ రెండు వర్షన్స్ ఒకేసారి రిలీజ్ విషయంలో మాత్రం కాస్త ఆలోచించి ఉంటే, సరిపోయేది అన్నది ట్రేడ్ వర్గాల ఆలోచన. మరి అంతా అయిపోయాక ఆకులు పట్టుకుని ఏం లాభం..జరగబోయేది చూడటం తప్ప.

ADVERTISEMENT
Latest Stories