2024 తెలుగు చిత్ర పరిశ్రమ కు ఒక ఉగాది పచ్చడి లాంటి అనుభూతిని మిగిల్చిందనే చెప్పాలి. ఈ ఏడాది తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటింది. జనవరి 12 2024 న హనుMAN తో మొదలైన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వేట డిసెంబర్ 5 2024 పుష్ప తో ఎండ్ అయ్యింది.
చిన్న సినిమాగా ఎటువంటి భారీ అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాతి పండుగకు వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టుకుని ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ మీద భారీ అంచనాలను పెంచింది. అలాగే దర్శకుడిగా ప్రశాంత్ వర్మ కు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత వచ్చిన గుంటూరు కారం టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టుకుంది.
Also Read – కూటమిలో నేతలే వైసీపీకి నిప్పు అందిస్తున్నారా?
ఇలా వాటి కొనసాగింపుగా వచ్చిన ప్రభాస్ కల్కి, సిద్దు టిల్లు స్క్వేర్, నాని సరిపోదా శనివారం, ఎన్టీఆర్ దేవర, దుల్కర్ లక్కీ భాస్కర్, మత్తు వదలరా-2 ,క బాక్స్ వద్ద తమ సత్తా చాటాయి. ఇక మోస్ట్ ఏవైటింగ్ పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన అల్లు అర్జున్ పుష్ప ఇండియన్ సినిమా రికార్డుల దుమ్ముదులిపింది.
అయితే పుష్ప మూవీ పరంగా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ జరిగిన ఒక చిన్న నిర్లక్ష్యం ఫలితంగా భారీ మూల్యం చెల్లిచింది. అనుకోని సంఘటన ఎదుటకి వచ్చి నిలబడినట్టు సంధ్యా ధియేటర్ ఘటన అటు బన్నీ తో పాటుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఊహించని షాక్ ఇచ్చింది. అలాగే బాధిత కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
Also Read – వివాదానికి ‘విషెస్’ తో ముగింపా.?
ఈ ఘటనకు పరోక్షంగా అల్లు అర్జున్ కారకుడైన నేపథ్యంలో ఎవరి ఊహకు అందని విధంగా తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైలు కు పంపించడం, ఇక ఆ తరువాత బన్నీ vs తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా కొనసాగిన పరిణామాలన్నీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఎమోషన్ లోకి నెట్టేసింది. ఇలా ఏడాది తెలుగు సినిమా హనుమాన్ అనే డివోషన్ తో మొదలై పుష్ప అనే ఎమోషన్ తో ఎండ్ అవుతుంది.