2029 ఎన్నికలకు పాదయాత్రలే కేంద్ర బింధువులా.?

2029 elections and padayatra politics

ఇప్పటికి రెండున్నరేళ్లు ముగిసిపోయాయి, మరో రెండున్నరేళ్లు కళ్ళు మూసుకుంటే నా పాదయాత్రతో యిట్టె మనం అధికారంలోకి వచ్చేస్తాం అంటూ వైఎస్ జగన్ తన పార్టీ క్యాడర్ ని లీడర్లను బుజ్జగిస్తున్నారు.

సేమ్ టూ సేమ్ అన్నట్టుగా కేటీఆర్ సైతం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు తానూ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకుంటా, బిఆర్ఎస్ పార్టీని మరోసారి క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ చేస్తా, వచ్చేది మనమే అప్పటి వరకు రోజులు లెక్కపెట్టుకోండి అంటూ తన పార్టీ శ్రేణులకు హితబోధలు చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇక తెలంగాణ రక్షణ సేన పేరుతో తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేయడానికి కల్వకుంట్ల కవిత సైతం పాదయాత్రకు ప్రణాళికలు వేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. కేసీఆర్ ని కాదని, కేటీఆర్ ని పక్కన పెట్టి, రేవంత్ పక్కకు నెట్టి కవిత తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం పై కూర్చునేందుకు పాదయాత్రనే ఆయుధంగా చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, తన రాజకీయంతో సామాన్యుడిని రాష్ట్ర సీఎం కుర్చీలో కురోపెడతా అంటూ ప్రకటనలు చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సైతం ఎన్నికలకు ముందు ఏపీలో పాదయాత్ర చేస్తా అంటూ ప్రకటించారు.

మరి ఇలా అధికారం కోసం ఎవరి పార్టీ జెండా పట్టుకుని వారు రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర కార్యక్రమాలకు సై అంటే అధికారంలో ఉన్న పార్టీలు కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతాయా.? వారు కూడా తమ పార్టీ తరుపున ప్రజలలోకి వెళ్లేందుకు యాత్రలు మొదలుపెట్టరా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పలేం.

ఇప్పటికే లోకేష్ కి 2024 ఎన్నికల ముందు చేసిన ప్రజాగళం పాదయాత్ర అనుభవం ఉన్న నేపధ్యం, దాని తాలూకా ప్రజలలో పార్టీ పట్ల వచ్చిన సానుకూల ప్రభావం రుచి చూసిన లోకేష్ 2029 ఎన్నికల కోసం రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేయకుండా ఉంటారా.?

అలాగే అటు సీఎం రేవంత్ సైతం కేటీఆర్ పాదయాత్ర కి అనుమతులిస్తూ ప్రేక్షక పాత్రలో ఉండిపోతారా.? వీరి పాదయాత్రాలకు కౌంటర్ గా రేవంత్ సైతం ప్రజా యాత్రలు చెయ్యరా.? ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఆయా పార్టీల నాయకులు చేపట్టే పాదయాత్రలు కేంద్ర బింధువుగా మారే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories