షూటింగ్ లో ఉన్న సినిమాకు 45 కోట్ల టివి ఆఫర్!

Kaabil-eyes-trailerబాలీవుడ్ లో హృతిక్ రోషన్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఘనత హృతిక్ ది. ఇండియన్ సూపర్ మ్యాన్ గా పేరు గాంచిన హృతిక్ నటించిన తాజా చిత్రం ‘కాబిల్’ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

‘ది మైండ్ సీస్ ఇట్ ఆల్’ అంటూ హృతిక్ కళ్ళు మాత్రమే ఉన్న ఫస్ట్ లుక్ వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2017, జనవరి 26వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు బాలీవుడ్ వర్గాల్లో పిచ్చ క్రేజ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

దాదాపు 45 కోట్లు వెచ్చించి ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ స్టార్ గోల్డ్ ఛానల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ఖాన్’ త్రయం అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ చిత్రాలకు మాత్రమే ఈ రేంజ్ లో శాటిలైట్ హక్కులు పలుకుతాయి. అలాగే గతంలో హృతిక్ ‘క్రిష్ 3’కి కూడా భారీ మొత్తం పలికినా, ఇంకా విడుదలకు దాదాపుగా 8 మాసాలు ఉండగానే మరే చిత్రానికి ఇంత పెద్ద మొత్తంలో శాటిలైట్ హక్కులు అమ్ముడుపోక పోవడంతో ‘కాబిల్’ సినిమాపై మార్కెట్ వర్గాల్లో ఓ క్రేజ్ ఏర్పడింది. మొత్తానికి షూటింగ్ దశలోనే ‘కాబిల్’ నిర్మాతలు బంపర్ ఆఫర్ ను కొట్టేసారన్న మాట.

ADVERTISEMENT
Latest Stories