ప్రస్తుతం విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి ప్రిన్స్ మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి చక్కర్లు కొడుతోన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, తదుపరి సినిమా షెడ్యూల్ ఈ నెల రెండవ వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో… 10వ తేదీన ల్యాండ్ అవబోతున్న ప్రిన్స్, వచ్చి రావడంతోనే బిజీ బిజీ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేసుకున్నారు.
25 ఏళ్ళ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ వేడుకకు విచ్చేస్తానని మాట ఇచ్చిన ప్రిన్స్, దర్శకుడు కొరటాల శివతో పాటు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. అలాగే ఇదే రోజున తన బావ సుధీర్ బాబు నటించిన “సమ్మోహనం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తళుక్కుమననున్నారు. తన కొత్త సినిమా కోసం గడ్డం పెంచుతుండడంతో… ప్రిన్స్ న్యూ లుక్ ఈ రెండు వేడుకలలో చూడవచ్చనేది అభిమానుల ఆకాంక్ష. అంటే ప్రిన్స్ ఫస్ట్ లుక్ మరో అయిదు రోజుల్లో… అన్న మాట!



