20 రోజులకు పవన్ కళ్యాణ్ కు 50 కోట్లు

50 crores remuneration for pawan kalyan 20 days schedule for pink movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రావడం ఖాయం అయిపోయింది. బాలీవుడ్ లో హిట్టయిన పింక్ రీమేక్ లో ఆయన నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. మొన్నే ఆ సినిమా ముహూర్తం కూడా చేసుకుంది. థమన్ సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ADVERTISEMENT

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 7వ తారీఖు నుండి మొదలవుతుందట. మొదటిగా పవన్ కళ్యాణ్ అవసరం లేని సీన్స్ తీస్తారట. ఆ తరువాత ఫిబ్రవరిలో పవన్ ఎంటర్ అవ్వొచ్చంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కేవలం 20రోజులు డేట్స్ ఇచ్చారట. ఈ ఇరవై రోజులలో పవన్ కళ్యాణ్ పార్టు మొత్తం పూర్తి చేసేస్తారట.

సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర తక్కువే దానితో 20 రోజులు సరిపోతాయి అంటున్నారు. అయితే ఈ ఇరవై రోజుల కష్టానికే పవన్ కళ్యాణ్ కు యాభై కోట్లు రాబోతున్నాయట. కథప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే నివేత థామస్, అంజలి కంఫర్మ్ అయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తాడు.

ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట.

ADVERTISEMENT
Latest Stories