బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మరియు ఆయన సతీమణి కిరణ్ రావులు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. పుణెలో పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యమేవ జయతే వాటర్ కప్ అవార్డ్స్ ఫంక్షన్ కు ఈ కారణంగానే హాజరు కాలేకపోయానని అమీర్ వివరణ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయినప్పటికీ తన స్నేహితుడు షారూక్ ను పంపించాడు.
ADVERTISEMENT
ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం కావడంతో తన బదులు కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మిత్రుడు షారూక్ ను అడిగానని, తనకు వచ్చిన స్వైన్‌ఫ్లూను ఇతరులకు అంటించి, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఫంక్షన్ కు రాలేదని వివరిస్తూ ఓ వీడియో సందేశంలో అమీర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్న అమీర్ కు వారం పాటు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.
ADVERTISEMENT


