పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “పోకిరి” సినిమా రిలీజ్ అయిన సమయంలో… ఈ సినిమా ఉధృతిని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద నిలబడిన సినిమాలలో విశాల్ “పందెం కోడి” ఒకటి. ఓ డబ్బింగ్ చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, తెలుగునాట విశాల్ కు ఓ మంచి మార్కెట్ ను ఏర్పరిచింది. ఆ హిట్ తో విశాల్ చిత్రాలన్నీ తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి గానీ, ఏది హిట్ స్థాయికి చేరుకోలేదు.
అలాగే ఒకటి, రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత “అభిమన్యుడు” రూపంలో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నాడు విశాల్. తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా గత వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, తమిళం మాదిరే తెలుగులోనూ సక్సెస్ అందుకుంది. దీంతోదాదాపుగా ఓ దశాబ్దం తర్వాత విశాల్ ఖాతాలో హిట్టుతో పాటు, ఈ ఏడాదిలో హీరోయిన్ సమంత అకౌంట్ లో హ్యాట్రిక్ హిట్ నమోదైంది.



