ఫామ్ కోల్పోయినా ర్యాంకింగ్ కోల్పోలేదు..!

Abhishek Sharma Form

ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న టి-20 వరల్డ్ కప్ భారీ స్థాయిలో సక్సెస్ అయిందని ఐసీసీ ప్రకటించగా, ఇటీవలే హోమ్ టీం భారత్ సెమీస్ ను చేరి ఫ్యాన్స్ ను ఖుషి చేసారు. అయితే, జట్టు మొత్తంలో ఉన్న ఏకైక ఆందోళన అభిషేక్ శర్మ ఫామ్.

టి-20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందు no.1 బ్యాటర్ గా నిలిచిన అభిషేక్ పై భారత్ అభిమానులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. వాటన్నిటికీ విరుద్ధంగా అభిషేక్ ఈ టోర్నీ లో దారుణంగా విఫలమయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు 7 మ్యాచ్లలో అభి కేవలం ఒక్క 50+ స్కోరు మాత్రమే చేయగలిగాడు.

ADVERTISEMENT

పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, వెస్ట్-ఇండీస్ వంటి జట్ల పై అత్యంత ముఖ్యమైన మ్యాచ్లలో తన వికెట్ను సునాయాసంగా ఇచ్చేసాడు అభి. టోర్నీ ప్రారంభానికి మునుపు న్యూజిలాండ్, ఆఫ్రికా, ఇంగ్లాండ్ వంటి టాప్ క్లాస్ జట్లపై అలవోకగా రన్స్ కొట్టిన అభి వరల్డ్ కప్ కు వచ్చేసరికి ఎనలేని ఒత్తిడిలో కనిపిస్తున్నాడు.

సూర్య, ఇషాన్, సంజు, తిలక్, హార్దిక్, దూబే ఇలా జట్టులో భాగమయిన ప్రతి బ్యాటర్ ఇప్పటికే జట్టులో తమ స్థానాన్ని సమర్ధించుకున్నారు. అభి జింబాబ్వే పై 50 కొట్టినప్పటికీ, ఆ ఇన్నింగ్స్ ను పెద్దదిగా మలచడంలో విఫలమయ్యాడు. ఇలా, టోర్నీ కీలక దశకు వచ్చిన వేల అందరి కళ్ళు అభిషేక్ పైనే పడ్డాయి.

ఇలాగే 2024 టి-20 వరల్డ్ కప్ కు కూడా విరాట్ కోహ్లీ ఎనలేని హైప్ తో ఎంట్రీ ఇవ్వగా, ఆ టోర్నీ విరాట్ ఫ్యాన్స్ కు అంత గుర్తుంచుకోదగినది కాదు. లీగ్ స్టేజ్, గ్రూప్ స్టేజ్, సెమీస్ లో విఫలమయిన విరాట్, ఫైనల్ లో మాత్రం భారత్ కు అడ్డుగోడలా నిలబడ్డాడు.మరి అదే తంతులో గ్రూప్ స్టేజి, లీగ్ స్టేజిలో ఫామ్ చూపించుకోలేకపోయిన అభిషేక్ శర్మ 2024 విరాట్ కోహ్లీ రీతిలో అత్యంత ముఖ్యమైన మ్యాచ్లో ఫామ్ అందుకుంటాడా..?

ఇక, వీటన్నిటి మధ్యలో ప్రతి బుధవారం ఐసీసీ ర్యాంకింగ్స్ ను విడుదల చేసే ప్రక్రియలో, నేడు ప్రకటించిన ర్యాంకింగ్స్ లో no.1 టి-20 బ్యాటర్ స్థానమును అభి ఇంకా పదిలంగానే ఉంచుకున్నాడు. చూడాలి మరి no .1 టి-20 బ్యాటర్ భారత్ కు మోస్ట్ ఇంపార్టెంట్ సెమీస్ లో ఏ మేరకు రాణిస్తాడో అని..?

ADVERTISEMENT
Latest Stories