చారి గారి లుక్ అదిరింది!

 Achari America Yatra new look‘అదుర్స్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన ‘చారి’ పాత్ర ఎంత పేరుప్రఖ్యాతలను తెచ్చిపెట్టిందో, జూనియర్ పక్కన నటించిన బ్రహ్మానందం పాత్ర అంతకుమించిన స్థాయిలో సందడి చేసింది. ఆ తర్వాత మరీ ఆ రేంజ్ లో నటించని బ్రహ్మి, తాజాగా “ఆచారి అమెరికా యాత్ర” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మంచు విష్ణు, బ్రహ్మానందంలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్ కోసం అమెరికా పయనం అవుతోంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన ‘ఆచారి’ గారి లుక్ అదిరింది. చేతికి కడియం, మెడలో రుద్రాక్ష మాల ధరించి ఉన్న బ్రహ్మి లుక్ సినిమాలో వినోదాన్ని పండించే విధంగా ఉంది. ‘అదుర్స్’ సినిమా తర్వాత మంచు విష్ణుతో నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమాలో నటించిన బ్రహ్మి, మళ్ళీ చాలాకాలం తర్వాత ఆ తరహా క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు. ఇటీవల కాలంలో బ్రహ్మి క్రేజ్ తగ్గిన దరిమిలా సినీ అవకాశాలు కూడా బాగా సన్నగిల్లాయి. దీంతో మళ్ళీ ఓ మాంచి బ్రేక్ కోసం ఈ ‘కామెడీ కింగ్’ ఎదురుచూస్తున్నాడు.

ADVERTISEMENT

‘ఆచారి’ పోస్టర్స్ చూస్తుంటే… బ్రహ్మి బ్యాక్ విత్ ఎ బ్యాంగ్… అన్న మాదిరి కనపడుతున్నాడు. పెద్ద సినిమా కూడా కాకపోవడంతో, ఈ సినిమా హిట్టయితే ఎక్కువ శాతం క్రెడిట్ బ్రహ్మి ఖాతాలోకే వెళ్ళిపోతుంది. గతంలో ‘రేసుగుర్రం’ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చి సినిమాను లేపేసిన బ్రహ్మి, ఈ ఫుల్ లెంగ్త్ రోల్ లో అలరిస్తే… మళ్ళీ దర్శకనిర్మాతలు క్యూలు కట్టడం ఖాయమేమో! చారి గారి విశ్వరూపం చూడాలంటే కొన్నాళ్ళ పాటు వేచిచూడాలి మరి!

ADVERTISEMENT
Latest Stories