మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ఒక మాస్ హీరో నుండి అభిమానులు కోరుకునే అన్ని ఎలెమెంట్స్ తో టీజర్ కట్ చేసి సినిమా పై అంచనాలు పెంచారు. చిరంజీవి స్టైలింగ్, సూపర్బ్ లొకేషన్స్, స్టన్నింగ్ విజువల్స్, వండర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అదిరిపోయే ఫైట్స్ ఇలా అన్ని చక్కగా కుదిరాయి అన్నట్టుగా టీజర్ పర్ఫెక్ట్ గా కట్ చేశారు.
రామ్ చరణ్ వాయిస్ – ఓవర్ మరో ప్రధాన ఆకర్షణ. సినిమా ఇలా ఉండి…. సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ లను ఒకేసారి చూసే అవకాశం వస్తే ఇక అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఏదో కంపెనీ కోసం ఒక గ్రామాన్ని ఖాళీ చేసే ప్రయత్నాన్ని అడ్డుకునే పాత్రలో బహుశా చిరంజీవి కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు ఓటమి ఎరుగని కొరటాల ఖాతాలో మరో భారీ హిట్ ఖాయమని అందరు అభిప్రాయపడుతున్నారు. అయితే టీజర్ విడుదల చేసిన కాసేపటికి తమ సినిమా మే 13న విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది వెంకటేష్ అభిమానులకు షాకింగ్ గా మారింది.
ఎందుకంటే మే 14న వెంకటేష్ నారప్ప విడుదల చెయ్యనున్నట్టు అప్పటికే ప్రకటించారు. అయితే క్లాష్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు తమ రిలీజ్ డేట్ మార్చుకుంటారు అనేది చూడాలి. నిన్నటి నుండి వరుసగా వస్తున్న రిలీజ్ డేట్ ప్రకటనలలో మొట్టమొదటి సారిగా రెండు సినిమాలు క్లాష్ అయ్యాయి.





