టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హేమ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ గా వ్యాఖ్యలు చేసే హేమ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలాంటి వ్యాఖ్యలే చేసారు. ఓ మీడియా ప్రతినిధిని పట్టుకుని… మీకు సరిగా మాట్లాడడమే రాదు కదా… మీరు ఎలా యాంకర్ అయ్యారు..? అంటూ ప్రశ్నించింది. దీంతో బిత్తరపోయిన సదరు మీడియా ప్రతినిధి, చేసేదేమీ లేక నవ్వేసారు.
అయితే ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందో కూడా హేమ ఓ బలమైన కారణం తెలిపింది. గతంలో సదరు మీడియా ప్రతినిధి… కమెడియన్ కం హీరో అయిన సునీల్ ను పట్టుకుని, ‘మీరు అద్దంలో ముఖం చూసుకున్నారా… మీది హీరో ఫేస్ అని మీరనుకుంటున్నారా..?’ అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ ప్రశ్న సునీల్ కు ఆగ్రహాన్ని తెప్పించింది గానీ, సదరు మీడియా ప్రతినిధిని నిలదీసే విధంగా కడిగేయడంలో విఫలమయ్యాడు.
సదరు విషయాన్నే ఇక్కడ ప్రస్తావించిన హేమ, ఆ రోజు నుండి మీరు కలిస్తే ఈ ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నానని చెప్పగా… బహుశా హేమ నుండి ఇది అంచనా వేయలేదేమో గానీ, అవాక్కైన సదరు మీడియా ప్రతినిధి తను చేసిన పొరపాటును ఒప్పుకున్నట్లుగా ఓ నవ్వు నవ్వేసాడు. కొన్ని కీలక విషయాలలో పురుషులలో లేనటువంటి తెగింపు హేమ లాంటి కొందరు మహిళలు మాత్రం అవలీలగా ప్రదర్శిస్తూ… ఎదుట వారిని అయోమయంలో పడేస్తుంటారు.


