హైబ్రిడ్ పిల్ల…హైబ్రిడ్ ఆలోచన..!

Actress Sai Pallavi

చేసింది కొన్నే సినిమాలు…ఆ చేసిన సినిమాలలో కూడా గ్లామర్ షో కి దూరంగా ఉంటూ లేడి పవర్ స్టార్ అనే టాగ్ సంపాదించుకోగలిగారు సాయి పల్లవి. ఫిదా మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ హైబ్రిడ్ పిల్ల అవకాశాల కోసం తాను గీసుకున్న హద్దులను చెరుపుకోలేదు. ఈ క్వాలిటీ తోనే అభిమానులను పెంచుకుంటూ పోతున్నారు సాయి పల్లవి.

ఇన్నాళ్లు నటిగా, మంచి డాన్సర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు తనకు డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందంటూ తన మనసులోని మాటను బహిర్గతం చేసారు. తన అభిరుచికి తగ్గ కథను రెడీ చేసుకుంటున్నా, అయితే అది ప్రస్తుతం ఆలోచన దశలోనే ఉంది, అది ఎప్పటికి నెరవేరుతుందో కూడా ఇప్పుడే చెప్పలేను అంటూ చెప్పేసారు. ఎప్పటికైనా అది ఆచరణ సాధ్యమైతే ఖచ్చితంగా అందరికి చెపుతాను అంటూ సెలవిచ్చారు.

ADVERTISEMENT

సాయి పల్లవి ఒక్కటే పీస్…అటు డాక్టర్..ఇటు యాక్టర్… ఇప్పుడు డైరెక్టర్…హైబ్రిడ్ పిల్ల అంటు ఈ అమ్మడి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తండేల్ మూవీ తో మరోసారి నాగ చైతన్యతో జత కడుతున్న సాయి పల్లవి…అటు అమీర్ ఖాన్ కుమారుడు హీరోగా లాంచ్ కాబోతున్న మూవీ లో నటిస్తూ బాలీవుడ్ లోను తొలి అడుగు వేయడానికి రెడీ అయ్యింది. నటించిన సినిమాలు అనుకున్నంత విజయాలను అందుకోలేకపోయినప్పటికీ సాయి పల్లవికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories