వెల్కం టు టాలీవుడ్ నాటియస్ట్ స్టార్!

Adhugo First Look Talkటాలెంటెడ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం వహిస్తోన్న “అదుగో” ఫస్ట్ లుక్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. టాలీవుడ్ లో నాటియస్ట్ స్టార్ గా పేర్కొంటూ సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన ‘అదుగో’ ఫస్ట్ లుక్ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ‘బంటి’ పేరుతో కనపడుతోన్న పందిపిల్ల చాలా క్యూట్ గా ఆకట్టుకునే విధంగా ఉంది.

[m9ad]

ADVERTISEMENT

ఈ సినిమా కోసం రవిబాబు ప్రత్యేకంగా ఓ పందిపిల్లను పెంచుకున్నాడు. గతంలో బంటితో పాల్గొని పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అయితే అనేక కారణాల వలన వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవ్వడం చెప్పుకోదగ్గ పరిణామం. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ నెలాఖరులో గానీ, అక్టోబర్ లో బంటిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories