ఈ ఏడాదిలో అతి పెద్ద బోరింగ్ సినిమా!

Adhugo movie public talkఎన్నో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ దీపావళి సందర్భంగా “అదుగో” సినిమా విడుదలైంది. పందిపిల్లతో రవిబాబు తెరకెక్కించిన ఈ సినిమా, ఈ ఏడాదిలో విడుదలైన మూవీలలో ‘అతి పెద్ద బోరింగ్ సినిమా’గా టాక్ తెచ్చుకుంది. ఇన్నాళ్ళ వరకు ఈ సినిమా ధియేటర్లలోకి ఎందుకు రాలేదో, విడుదలైన తర్వాత గానీ ప్రేక్షకులకు అవగతం కాలేదు.

[m9ad]

ADVERTISEMENT

సాధారణంగా ఎంత బోరింగ్ సినిమాలో అయినా చెప్పుకోవడానికి ఒకటో, రెండో విషయాలు హైలైట్స్ గా నిలుస్తాయి. కానీ ఈ “అదుగో”లో మాత్రం ఒక్కటి కూడా కానరాకపోవడం, రవిబాబు నుండి అస్సలు ఊహించినది కాదు. కధ, కధనం, నటీనటుల నటన, గ్రాఫిక్స్, కామెడీ… ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ “అదుగో” తీవ్రంగా నిరుత్సాహపరుస్తోందన్న టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ప్రజెంట్ చేయడం మరో కొసమెరుపు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి వస్తున్న సినిమా అంటే, ‘మినిమం గ్యారెంటీ’ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉండేది. కానీ దానిని కూడా రూపుమాపే విధంగా ఈ సినిమా టాక్ రావడం, సదరు బ్యానర్ కూడా ఊహించని విషయమేమో! ఏది ఏమైతేనేం… మొత్తానికి “అదుగో” విడుదల అయితే అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories