తెలుగు మీడియా ని ప్రశ్నలు అడగొద్దన్న టీమ్!

adipurush team requests no questions from mediaప్రభాస్ ఓంరౌత్ దర్శకత్వం లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ చూసి ప్రేక్షకులు, అభిమానులు అసహనానికి గురయ్యారు. ప్రభాస్ లాంటి హీరోతో కార్టూన్ సినిమా తీస్తారా? అని కొంత మంది నవ్వుకున్నారు. ఇంటర్నెట్ లో ఆదిపురుష్ టీజర్ ని విపరీతంగా ట్రోల్ చేసి ఆడుకున్నారు. టీజర్ వలన సినిమా మీద ఉన్న అంచనాలు తగ్గాయి.

ఈరోజు ఆదిపురుష్ చిత్ర బృందం ఏ.ఎం.బి. సినిమాస్ లో ౩డి లో టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చారు. అలాగే పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చే అవకాశం ఇది. కానీ టీజర్ గురించి పాత్రికేయులను ఎటువంటి ప్రశ్నలు అడగవద్దని ఆదిపురుష్ టీం Q&A తీసేసింది. పాత్రికేయులు కూడా టీజర్లోని లోపాలు అడిగితే, సినిమా మీద మరింత నెగెటీవ్ టాక్ ఏర్పడుతుందని ఆదిపురుష్ టీం ముందు జాగ్రత్త చర్యగా పాత్రికేయులను ప్రశ్నలడగవద్దని కోరారు.

ADVERTISEMENT

అయినా ఇప్పటికే దేశమంతా ఆదిపురుష్ టీజర్ చెయ్యాల్సిన డామేజ్ చేసేసింది. ఇక ఇప్పుడు అదే టీజర్ ని ౩డి లో చూస్తే కొత్తగా ఎం వస్తుందో అని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. తీసేముందే చూసుకుంటే ఇన్ని బాధలుండవుగా. టీజర్ చూసిన ప్రేక్షకులు దుమ్మెత్తి పోస్తున్నా, అవేమి పట్టించుకోకుండా ప్రభాస్, ఓంరౌత్ హాయిగా ప్రచారాల్లో నవ్వుతూ పాల్గొనడం విచిత్రం.

ADVERTISEMENT
Latest Stories