మణిరత్నం సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించిన అదితీరావు, అదే సినిమా అనువాదమైన ‘చెలియా’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఆ తరువాత అదితీరావు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘సమ్మోహనం’ మూవీతోనే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ లభించడంతో ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అదితిరావు పేరు మారుమ్రోగుతోంది.
‘సమీరా’ పాత్రలో అదితీరావు అద్భుతంగా నటించిందని విమర్శకులు కూడా కితాబిచ్చేసారు. స్టార్ హీరోయిన్ పాత్రలో ఆమె ఎంతో సహజమైన అభినయాన్ని కనబరిచిందని, పాత్రకు సహజత్వాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యిందని, నిజంగానే ఓ స్టార్ హీరోయిన్ ను దగ్గర నుంచి చూస్తున్నట్టుగా అనిపించిందనే పాజిటివ్ స్పందనను తెచ్చుకుంది. అందం, అభినయంతోను ఆకర్షించడంతో, తెలుగులో మరిన్ని ఛాన్సులతో ఆమె బిజీ కావడం ఖాయమనే టాక్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది.



