మరో బాలీవుడ్ బ్యూటీతో మహేష్?

Aditi Rao Hydari to romance Mahesh BabuAditi Rao Hydari to romance Mahesh Babuమహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తే, ఆ సినిమా ‘తీర్ధయాత్ర’లకు వెళ్ళినట్టేననే టాక్ టాలీవుడ్ లో ఉండేది. అయితే ఇది ‘భరత్ అనే నేను’ విడుదలకు ముందువరకు! ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటించడం, సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సెంటిమెంట్ కు బ్రేక్ ఇచ్చినట్లయ్యింది. దీంతో వరుసగా బాలీవుడ్ ముద్దుగుమ్మలకు అవకాశాలు ఇచ్చే పనిలో ప్రిన్స్ అండ్ కో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న మహేష్ తాజాగా చిత్రంలో మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఇంకొక బ్యూటీని కూడా ఎంపిక చేసినట్లుగా లేటెస్ట్ టాక్. ఆ పేరు కూడా బాలీవుడ్ నుండే కావడం మరో విశేషం. ‘సమ్మోహనం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న అదితిరావును మహేష్ తాజా చిత్రం కోసం తీసుకున్నట్లుగా ట్రేడ్ టాక్.

అధికారికంగా ఇంకా డిక్లేర్ చేయలేదు గానీ, సినిమాలో ఓ కీలకపాత్ర కోసం అదితి ఎంపిక జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే “సమ్మోహనం” సినిమా చూసిన మహేష్ బాబు, ఈ సినిమా యూనిట్ ను అభినందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకున్న అదితి, తన డబ్బింగ్ ను తానే చెప్పుకోవడం విశేషం. బహుశా ఈ అన్ని కోణాల్లో ప్రిన్స్ అండ్ కో ఫ్లాట్ అయినట్లున్నారు. అయితే అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories