ఒక్క సినిమా ఈ యాక్టర్ లైఫ్ ని టర్న్ చేసేసింది. వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్న అడవి శేషు ‘గూడాచారి’ సినిమాతో ఒక్కసారిగా శేషు బిజీ హీరోగా మారిపోయాడు..ఒక పక్క ‘టూ- స్టేట్స్’ సినిమాలో తన పాత్ర పోషిస్తునే మరో పక్క గూడాచారి-2 కి రంగం సిద్ధం చేసుకున్నాడు..
[m9ad]
అయితే అక్కడితో కదా అయిపోలేదు…ఇప్పుడు తాజాగా శేషు కన్ను స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది ఇన్విసిబిల్ గెస్ట్’పై పడింది..ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది..ఇక ఈ సినిమాకి ప్రఖ్యాత పీ.వీ.పీ బ్యానర్ నిర్మిస్తుంది.
అయితే ఈ సినిమా కథ కూడా మంచి ఇంటరెస్టింగ్ కథ..ఒక బడా వ్యాపారవేత్తగా తన మాజీ ప్రేమికురాలి హత్య కేసులో నిందను ఎదుర్కొని ఎలా దాని నుంచి బయటపడ్డాడు అన్న పాయింట్ తో సాగనుంది కథ.
మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ను అందిస్తుందో చూద్దాం.



