తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసంగించిన ముద్రగడ పద్మనాభం… “తమకు ఇచ్చిన ఆరు హామీలను ఈ నెల 10వ తేదీ లోపు ప్రభుత్వం నిలబెట్టుకోవాలని” డిమాండ్ చేసారు. ఇచ్చిన హామీలను సదరు గడువు తేదీలోగా పరిష్కరించని పక్షంలో ఈ నెల 11 నుంచి మళ్లీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.
సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించమని అడగటం తప్పా? మా సమస్యలను పరిష్కరించమని అడగటం తప్పా? కులపోరాటాలను అణచివేస్తామని ప్రభుత్వం చెబుతుండటం ఎంత వరకు సబబు అంటూ ప్రసంగించారు. ముద్రగడ రాసిన లేఖపై టిడిపి వర్గాలు ఘాటుగా స్పందించడంతోనే మళ్ళీ దీక్ష అంటూ పాత పల్లవిని మళ్ళీ ఆలపిస్తున్నారని టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT





