సోషల్ మీడియా లో రెట్రో ట్రెండ్…

AI-generated 80s retro social media trend

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింత ట్రెండ్ నడుస్తుంది. 80 s రెట్రో లుక్ అంటూ సినీ, రాజకీయ సెలబ్రెటీల ప్రస్తుత ఫోటోలను AI సాయంతో 80 S లుక్ లోకి మారుస్తున్నారు. వారి అభిమానులు, మద్దతుదారులు ఇప్పుడా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెట్టి కేటీఆర్, నారా లోకేష్, జగన్, పవన్ ఇలా పలు పొలిటికల్ సెలబ్రెటీల ఫోటోలు, అలాగే ప్రభాస్, మహేష్, అమితాబచ్చన్, రజనీకాంత్ వంటి సినీ సెలబ్రెటీల వరకు అందరి ఫోటోలను AI సాయంతో రెట్రో లుక్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు.

ADVERTISEMENT

నాటి కాలాన్ని గుర్తు తెచ్చే రంగులు, దుస్తులు, హెయిర్ స్టైల్స్ తో ఫిల్మీ లుక్ తో ఫోటోలను మార్చుకునేందుకు సాధారణ యువత కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 80 S రెట్రో లుక్ ట్రేండింగ్ లో ఉంది.

సదరు యూజర్ ఒక్క ఫోటోను అప్ లోడ్ చేస్తే చాలు దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ తో సహా1980 నాటి సినిమా స్టైల్ ఫోటోను మన కళ్ళ ముందు ఉంచుతుంది AI. దీనితో నేటి యువత ఆ పనిలో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో, ఏది ట్రేండింగ్ లో ఉంటుందో చెప్పడం కష్టం.

ప్రస్తుతానికి ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తుంది. అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కూడా ఈ ట్రెండ్ ని ఫాలో అవడంతో రెట్రో సందడి ఇంకొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

మరి మీరు కూడా AI సాయంతో మీ 80 s రెట్రో లుక్ ను చేసుకున్నారా.? అయితే ఈ AI ఫోటో ఎడిటింగ్ పై పెరుగుతున్న ఆసక్తి తో మీ ఫోటోలను సదరు యాప్ లో అప్ లోడ్ చేసేటపుడు తగు ప్రైవసీ జాగ్రత్తలు కూడా అవసరం అంటున్నారు సోషల్ మీడియా నిపుణులు.

ADVERTISEMENT
Latest Stories