ఇడ్లీ అమ్ముకునే వ్యక్తికి సూపర్ స్టార్ వితరణ

Ajith Kumar help to idli vendorతలా అజిత్ తదుపరి, వాలిమై ప్రధానంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబడింది. దాదాపు ప్రతిరోజూ షూట్ తర్వాత రాత్రులలో నటుడు ఫిలిం సిటీకి దగ్గరలో రోడ్డు పక్కన ఇడ్లీ స్టాల్‌ను సందర్శించేవాడట అని విశ్వసనీయంగా తెలిసింది. అక్కడ ఫుడ్ ని చాలా ఇష్టపడే వాడట.

ఆ సమయంలో అతను ఆ ఇడ్లీ అమ్మే కుటుంబం గురించి ఆరా తీసేవాడట. తన పిల్లలకు చదువు చెప్పించడానికి ఇబ్బందులు పడుతున్నాడు అని తెలుసుకున్న ఈ నటుడు హైదరాబాద్ లోని పిల్లల చదువు కోసం అతనికి లక్ష రూపాయలు ఇచ్చాడని సమాచారం. ఇది నిజంగా ఎంతో మంచి విషయం.

ADVERTISEMENT

మరోవైపు… అజిత్ వాలిమై షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తి చేశాడు. ఈ మూవీకి ఇంకా ఆరు రోజుల షూటింగ్ పూర్తి చెయ్యాల్సి ఉంది. చివరి షెడ్యూల్ కోసం బృందం మొరాకోకు వెళ్లే అవకాశం ఉంది. షెడ్యూల్ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత ఇంకా వెలువడలేదు.

ఆ సినిమాని ఆగష్టు లో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం గత సంవత్సరం దీపావళికి విడుదల కావాల్సి ఉంది కాని కరోనా కారణంగా వాయిదా వేసింది. అంటే అనుకున్న ప్లాన్ ప్రకారం దాదాపుగా ఏడాది ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు.

ADVERTISEMENT
Latest Stories