ఏమున్నాడురా బాబు మా అన్నయ్య!

 Akhil Akkineni praises brother naga chaitanyaమరో మూడు రోజుల్లో “శైలజారెడ్డి అల్లుడు” రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అక్కినేని నాగచైతన్య గురించి సోదరుడు అఖిల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా స్టేజ్ పై వ్యాఖ్యానించిన అఖిల్… ‘మారుతీ గారు సరైన టైంలో మా అన్నయ్యను పట్టుకుని అల్లుడుని చేసేసారు, ఇటీవలే పెళ్ళయ్యింది, పెళ్ళయిన తర్వాత అన్నయ్య ఫేస్ లో గ్లో పెరిగింది’ అంటూ చెప్పడంలో ఒక రకమైన సిగ్గుతో చైతూ ముఖానికి చేయి అడ్డుపెట్టుకున్నాడు.

[m9ad]

ADVERTISEMENT

‘ఏమున్నాడురా బాబు మా అన్నయ్య… స్క్రీన్ పైన అదిరిపోతున్నాడు… ఈ సినిమాతో మంచి హిట్ కొట్టబోతున్నాం అనిపిస్తోంది… నాన్న గారు చెప్పినట్టు అల్లరి అల్లుడులానే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ అఖిల్ హుషారైన మాటలకు ఫ్యాన్స్ లో ఉత్సాహం వెల్లువిరిసింది. అక్కినేని బ్రదర్స్ చైతూ – అఖిల్ ల నడుమ ఎంత ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయో అభిమానుల సమక్షంలో మరోసారి స్పష్టమైంది.

ADVERTISEMENT
Latest Stories