అఖిల్ తో వెంకీ అట్లూరి మరో మూవీ?

Akhil Akkineni - wants to do another film with director venky atluri“తొలి ప్రేమ” దర్శకుడు వెంకీ అట్లూరి…అఖిల్ తో కలసి ఈ శుక్రవారం మిస్టర్ మజ్ను అంటూ థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. అయితే నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా వేడుకలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత నవీన్ మాట్లాడుతూ వెంకీ అట్లూరితో తరువాత సినిమా చేయబోతున్నామని ప్రకటించేశాడు. అయితే అంతా బాగానే ఉంది కానీ, అక్కడే అసలు లాక్ ఒకటి ఓపెన్ అయ్యింది.

అదేంటి అంటే, సహజంగా హిట్ ఇచ్చిన దర్శకులను లాక్ చేసి సినిమాలు చెయ్యడం మైత్రీ మూవీస్ సంస్థకి అలవాటే, అదే క్రమంలో యువ హీరోల డేట్స్ అన్నీ ఈ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఉన్న ఒక్కో దర్శకుడికి ఒక్కో హీరోతో సినిమాను రెడీ చేసేసే పనిలో బిజీగా ఉంది ఈ సంస్థ.

ADVERTISEMENT

మరో పక్క ఇప్పటివరకూ ఉన్న దర్శకులకు హీరోలు దొరికేసారు. ఇక ఇదే వేదికపై నవీన్ మాట్లాడుతూ తమ తర్వాత సినిమా అఖిల్ తో కూడా చేస్తాం అంటూ తెలిపారు.

ఇక ఈ రెండు మాటలు విన్న మీడియా మొత్తం ప్రస్తుతం వెంకీతో ఒక సినిమా చేస్తాం అన్న మైత్రీ, అదే క్రమంలో అఖిల్ తో తన తర్వాత సినిమా అని చెబుతున్న మైత్రీ తమ తర్వాత సినిమాని వెంకీ డైరెక్షన్ లో మళ్ళీ అఖిల్ తోనే ఉంటుందేమో అని తెగ చెవులు కొరికేసుకుంటుంది.

మరి ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ…మొత్తానికి వెంకీ మాత్రం జాక్ పాటు కొట్టినట్లే.

ADVERTISEMENT
Latest Stories