అక్కి హెయిర్ స్టైల్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!

Akshay Kumar, Akshay Kumar New Hair Style, Akshay Kumar Funky Hair Style, Akshay Kumar Funny Hair Style, Akshay Kumar Hilarious Hair Style విలక్ష‌ణ పాత్ర‌ల్లో క‌న‌బ‌డుతూ మంచి హిట్ల‌ను సొంతం చేసుకుంటోన్న బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్ తాజాగా ఓ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. వరుణ్‌ధావన్‌, జాన్‌ అబ్రహం, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌లు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపుదిద్దుకుంటున్న “డిష్యూం” సినిమాలో ఇప్పటివరకు కనిపించని కొత్త గెటప్ తో అక్ష‌య్ కుమార్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ నెల‌ 29న విడుదల కానున్న “డిష్యూం” చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, వీడియో సాంగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా ట్విట్టర్ ద్వారా ఈ మూవీలోని తన లుక్ ని తెలిపే పోస్ట‌ర్‌ను అక్ష‌య్‌ కుమార్ విడుద‌ల చేశాడు. దీనిలో అక్ష‌య్ రేస‌ర్‌గా క‌న‌బ‌డుతున్నాడు. కొత్త హెయిర్‌ స్టైల్‌తో ట్రెండ్ కు తగిన విధంగా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు అక్కి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories