అల వైకుంఠపురములో కు కొత్త తలపోటు

will allu arjun readh 100 crore club with Ala Vaikuntapuramlooస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ జరుగుతుంది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది ఇలా ఉండగా సినిమా ప్రమోషన్స్ జోరు కూడా పెంచుతున్నారు చిత్ర నిర్మాతలు.

ఈరోజు ఉదయం విడుదలైన బుట్ట బొమ్మ అనే పాట టీజర్ కు స్పందన అదిరిపోయింది. 24న ఫుల్ సాంగ్ విడుదల అవుతుంది. మరోవైపు సినిమా రన్ టైమ్ గురించి కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 185 నిముషాలు వచ్చిందట. అంటే మూడు గంటలకు ఐదు నిముషాలు పైనే సినిమా తేలిందట.

ADVERTISEMENT

సహజంగా మూడు గంటల పైగా సినిమాను ప్రేక్షకులు కూర్చుని ఎంజాయ్ చెయ్యడం చాలా అరుదు. పైగా మూడు గంటల పైగా సినిమాలు ఉంటే సంక్రాంతి సీజన్ లో ఎక్కువ షోలు వేసుకోవడం కూడా కష్టమే. దానితో సినిమాపై కత్తెర తప్పదు. ఇది ఇలా ఉండగా బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి భారీ హిట్లు కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి.

హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా ఏళ్ల తరువాత టబూ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలోకి తిరిగి వచ్చింది. చిత్రంలో ఒక కీలక పాత్రలో ఆమె చెయ్యబోతుందని సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ గత సినిమా నా పేరు సూర్య ప్లాప్ కావడంతో ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories