మహేష్ – మురుగదాస్ ప్రాజెక్ట్ లో క్రేజీ విషయం!

mahesh babu ar murugadoss combination movieతెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న మురుగదాస్ – మహేష్ బాబు ప్రాజెక్ట్ లో ప్రిన్స్ సరసన నటించాల్సిన హీరోయిన్ల జాబితాలో ఇప్పటివరకు దాదాపుగా అందరి టాప్ హీరోయిన్ల పేర్లు రావడం, ఒక్కరు కూడా ఖరారు కాకపోవడం గమనించదగ్గ అంశమే. అయితే తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ ప్రిన్స్ సరసన ఛాన్స్ కొట్టేసిందని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇటీవల కాలంలో బాలీవుడ్ లో మాంచి విజయాలు అందుకుంటూ ‘హాట్ అండ్ హిట్’ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలియా భట్ ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసారని, ద్వి భాషా చిత్రం కావడంతో అలియాకు బాగానే ముట్టచెప్పే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు హల్చల్ చేస్తున్న సమాచారంలో వాస్తవం ఎంత ఉందనేది తెలియాలి.

ADVERTISEMENT

గతంలో కీర్తి సురేష్ తో కూడా చిత్ర యూనిట్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుందని వార్తలు సందడి చేసినా, అవేమీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ సినిమాలో క్రేజీగా మారిన హీరోయిన్ విషయంపై చిత్ర యూనిట్ వర్గాలే అధికారిక సమాచారం తెలియజేయాలి. బహుశా సినిమా ప్రారంభానికైనా మహేష్ కు హీరోయిన్ సెట్ అవుతుందా లేదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories