అల్లరి నరేష్ కూడా ఓ ఇరుముడి ?

Allari Naresh in Kanakadurga first look

మాస్ మహారాజ్ ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. అయితే ఆ సినిమాలో ఓ పక్క అయ్యప్పస్వామి పూజలు, మాలధారణ, అయ్యప్ప పాటలతో అయ్యప్ప భక్తులను ఆకట్టుకుంటూనే, మరోపక్క తన మాస్ ఇమేజ్‌కు తగ్గట్లు పంచ్ డైలాగ్స్, యాక్షన్, కామెడీ, కూతురు సెంటిమెంట్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ వంటివన్నీ కూడా జోడించి హిట్ కొట్టారు. మరోవిధంగా చెప్పాలంటే ఇదొక కొత్త ఫార్మాట్ అనుకోవచ్చు.

ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లరి నరేష్.. ఆ తర్వాత ‘గమ్యం’, ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సినిమాలతో సీరియస్ పాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించారు. ఇటీవల ‘రంభ ఊర్వశి మేనక’ అంటూ మళ్ళీ కామెడీ ట్రై చేసినప్పటికీ అది మిస్ ఫైర్ అయింది.

ADVERTISEMENT

కనుక ఇప్పుడు రవితేజ ఇరుముడి స్పూర్తితో భక్తి, యాక్షన్, భావోద్వేగాలతో కూడిన ‘కనకదుర్గ’ను ఎంచుకున్నారా? అంటే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో కాషాయ దుస్తులతో నృత్యం చేస్తున్న నరేష్ లుక్ చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది.

ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కనకదుర్గ’ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్‌. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కథను ఎంచుకోవడం ఆయన కెరీర్‌లో మరో కొత్త ప్రయోగమనే చెప్పాలి.

ఒకవేళ అల్లరి నరేష్ కూడా ఈ సినిమాతో హిట్ కొడితే, ఇక హిట్ కోసం టాలీవుడ్‌లో విశ్వప్రయత్నాలు చేస్తున్న హీరోలందరూ ఈ లైన్ పట్టుకోవచ్చు.

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో టెంపుల్ టౌన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories