ప్రస్తుతం దేశంలో హాట్ హాట్ గా వినపడుతున్న పేర్లలో ‘కింగ్ ఫిషర్’ అధినేత విజయ్ మాల్యా పేరు ఒకటి. 17 బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్లు ఎగనామం పెట్టి, బ్రిటన్ చెక్కేసాడనే వార్తలతో గత రెండు, మూడు రోజులుగా విజయ్ మాల్యా పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. అలాగే తానూ ఎక్కడికి పారిపోలేదని, వ్యాపార లావాదేవీల నిమిత్తం లండన్ లో ఉన్నానని ట్విట్టర్ ద్వారా తెలిపిన విజయ్ మాల్యా అడ్రస్ పై మరో వైపు కూపీ లాగే పనిలో నిఘా వర్గాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, బ్యాంకుల కళ్ళు గప్పి తప్పించుకున్న విజయ్ మాల్యా తన ‘సెల్ఫీ’ చేతికి చిక్కరంటూ ‘అల్లరి’ నరేష్ తాజాగా ట్విట్టర్ లో తెలిపారు. ఇండియాలో విజయ్ మాల్యాతో దిగిన ఆ సెల్ఫీ ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేసుకున్నాడు అల్లరోడు. తన సినిమాలతో ఎప్పుడూ నవ్వించే అల్లరోడు, ఈ ఫోటోతో కూడా నవ్వించే ప్రయత్నమే చేసాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.



