‘మహేష్’కు పోటీగా వస్తున్న ‘మెగా హీరో’

Allu Arjun as Brand Ambassador for Redbus Online Bus Ticketsజూన్ 23వ తేదీన విడుదల కావాల్సిన ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” స్థానంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న “దువ్వాడ జగన్నాధమ్” విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇలా ప్రిన్స్ విడుదల తేదీని కబ్జా చేసిన బన్నీ, తాజాగా మహేష్ కు పోటీగా వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహేష్ ఖాతాలో ఉన్న కార్పొరేట్ సంస్థలలో ఇటీవల ‘అభిబస్.కాం’ కూడా చేరిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన దీనికి సంబంధించిన యాడ్లు ప్రజాధరణ కూడా పొందాయి.

అయతే ప్రిన్స్ ‘అభిబస్.కాం. అంటుంటే… లేటెస్ట్ గా బన్నీ ‘రెడ్ బస్.ఇన్’ అంటున్నాడు. యాడ్ రంగంలో మహేష్ తో పోటీగా కాకపోయినా, మహేష్ తర్వాత స్థానంలో రాణిస్తున్న అల్లు అర్జున్ ఖాతాలో తాజాగా చేరిన సంస్థ ‘రెడ్ బస్.ఇన్.’ దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ను సోషల్ మీడియాలో ‘రెడ్ బస్’ రిలీజ్ చేసింది. ఎరుపుమయం అయిపోయిన ఈ పోస్టర్ లో ఓ బ్యాగ్ పట్టుకుని స్టైల్ గా నిల్చున్న అల్లు అర్జున్ లుక్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. దీంతో టాలీవుడ్ లో ప్రిన్స్ కు ప్రత్యామ్నాయంగా బన్నీ మారుతున్నాడన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories