గీత గోవిందం” సెంటిమెంట్?

Allu Arjun chief guest for taxiwaala audio launchవిజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాదు, సెకండ్ లీగ్ లో ఉన్న మిగిలిన హీరోలకు కూడా షాక్ ఇచ్చే విధంగా “గీత గోవిందం” సాధించిన విజయం ట్రేడ్ వర్గాలను అవాక్కు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ విచ్చేయడం, ఈ సినిమా కధ గురించి తనకు తెలుసనీ, తాను ఇప్పటికే సినిమాను చూసానని, సూపర్ హిట్ గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

[m9ad]

తాజాగా “టాక్సీవాలా”కు కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా కనపడుతోంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుండగా, దీనికి ముఖ్య అతిధిగా స్టైలిష్ స్టార్ ను ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ‘టాక్సీవాలా’ నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు కావడంతో, బన్నీ రాక మరింత సులువు కానుంది.

మధ్యలో విడుదలైన విజయ్ దేవరకొండ “నోటా”ను ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఈ “టాక్సీవాలా” విజయం చాలా కీలకమనే చెప్పాలి. అయితే అనేక వాయిదాల నడుమ ఈ నెల 17వ తేదీన విడుదల అవుతోన్న ఈ సినిమాపై ఆశించినంత బజ్ అయితే కనిపించడం లేదు. బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రేక్షకులను ఈ సినిమా వైపుకు తిప్పేలా బన్నీ అండ్ విజయ్ దేవరకొండ ఏమైనా చేస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories