బన్నీకి చుక్కలు చూపించిన అభిమానులు!

Allu arjun Hampi Tourసినీ సెలబ్రిటీలు తమ కుటుంబంతో కలిసి బయట స్వేచ్చగా తిరగలేరన్న విషయం తెలిసిందే. ఒకవేళ ధైర్యం చేసి పబ్లిక్ ప్లేస్ లకు వెళితే… అభిమానుల కంట పడనంత వరకు బాగానే ఉంటుంది, అదే అభిమానులు చుట్టుముడితే మాత్రం, సెలబ్రిటీలకు చుక్కలు కనపడడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన సమయం గడిపేందుకు హంపి వెళ్ళగా, ఫ్యాన్స్ హంగామాతో చివరికి ఆ దర్శనం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

హంపీలోని విరూపాక్షేశ్వరుడిని దర్శించుకున్న అనంతరం, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కమల్ మహల్, రాతి రథం, విజయ విఠల ఆలయాలు సందర్శించారు. అయితే వీరు సందర్శనకు వెళ్లిన ప్రతి చోటా భారీ ఎత్తున అభిమానులు గుమికూడి, ఆటోగ్రాఫ్ లు, ఫోటోగ్రాఫ్ లు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో బన్నీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడంతో, సందర్శనను మధ్యలోనే రద్దు చేసుకుని హోటల్ కు చేరుకున్నారు. అయితే శనివారం నాడు మరికొన్ని స్మారక స్థలాలను చూసేందుకు వీరికి ఏర్పాట్లు చేశామని హంపి పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories