సుకుమార్… నిన్ను తగలెయ్యా..!

Allu Arjun imitates director sukumarప్రేక్షకులలో భిన్న స్పందనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద “పుష్ప” కనకవర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ ఓ ఫిగర్ ను విడుదల చేయగా, ‘పుష్ప’ కలెక్షన్స్ పై ఓవరాల్ గా మైత్రీ మూవీ మేకర్స్ సంతృప్తిగా ఉంది.

ADVERTISEMENT

ఈ సందర్భంగా ఫుల్ ఖుషీలో ఉన్న చిత్ర యూనిట్ రికార్డింగ్ ప్రమోషన్ కార్యక్రమాలను రిలీజ్ చేస్తోంది. అందులో భాగంగా విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో హీరో అల్లు అర్జున్ సెట్ లో సుకుమార్ ఎలా ఉంటారోనని ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులకు చేసి చూపించారు.

షాట్ పూర్తయిపోగానే ఎలా ఉందో అన్న టెన్షన్ తనకు ఉంటుందని, సుకుమార్ ఏమో తల గోక్కుంటూ అటు ఇటు తిరుగుతా ఉంటే తనకేమో షాట్ బాగా రాలేదేమో అని, సరే ఓ 2, 3 నిముషాలు సెట్ లో అలా తిరిగేసి సుకుమార్ దగ్గరికి వెళ్లి, మళ్ళీ షాట్ తీద్దామా అని అడుగుతానని అల్లు అర్జున్ తెలిపారు.

‘డార్లింగ్ మళ్ళీ టేక్ చేద్దామా’ అన్న దానికి సుకుమార్ స్పందిస్తూ… ‘హా డార్లింగ్ టేక్ బాగా వచ్చిందని’ ఒక్కసారిగా చెప్తారని అల్లు అర్జున్ చేసిన ఇమిటేట్ నవ్వులు పూయించింది. ‘నిన్ను తగలెయ్యా’ అని తాను లోలోన అనుకునేవాడినని, దీనికి సుకుమార్ నన్ను మన్నించాలని నవ్వుతూ చెప్పేసారు బన్నీ.

ఈ ఇమిటేటింగ్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, అది బన్నీ అభిమానులతో పాటు నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది. సుకుమార్ స్టైల్ లో బన్నీ నిల్చున్న విధానం, సుకుమార్ మాదిరి తల గోక్కుంటూ పక్కకు వెళ్లిన వైనం… బన్నీలోని ఇమిటేటింగ్ కోణాన్ని అభిమానులకు పరిచయం చేసాడు.

https://twitter.com/MythriOfficial/status/1472548053668143105

ADVERTISEMENT
Latest Stories