వైరల్ : నువ్వు లేకపోతే నేను లేను!

Allu Arjun in Pushpa Thank You Meet“పుష్ప థాంక్యూ మీట్”లో భాగంగా సోమవారం నాడు జరిగిన వేడుకలో హీరో అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్… ఇద్దరూ ఆనంద భాష్పాలను రాల్చారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆఫీస్ బాయ్ నుండి నిర్మాత వరకు పేరుపేరునా స్క్రీన్ పైన ఫోటోలు వేసి మరీ బన్నీ ధన్యవాదాలు తెలపడం హైలైట్ కాగా, సుకుమార్ దగ్గరికి వచ్చేపాటికి ఎమోషనల్ అయిపోయారు.

తాను ఋణపడిపోయిన వ్యక్తులు కొద్దిమందే ఉన్నారని, నిజానికి తనకు సుకుమార్ అంత ఇష్టం అని తనకు తెలియదని, ‘పరుగు’ సినిమా టైంలో తాను 85 లక్షలతో ఓ స్పోర్ట్స్ కారును కొనుక్కున్నానని, ఆ కారెక్కి స్టీరింగ్ పట్టుకున్న సమయంలో… దీనికి ఎవరు కారణం అయి ఉంటారు అంటే తనకు గుర్తొచ్చిన మొదటి పేరు సుకుమార్ అని చెప్పి మరో మాట పలకలేకపోయారు.

ADVERTISEMENT

బన్నీ మాటలకు సుక్కు కూడా చేతులు అడ్డు పెట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ‘డార్లింగ్… నువ్వు లేకపోతే నేను లేను, ఆర్య లేదు, ఏదీ లేదు’ అంటూ బన్నీ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. ఊహించని ఈ సంఘటనతో చిత్ర యూనిట్ అంతా వీరిద్దరికి అభివాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

‘పుష్ప’ సినిమాపై విశ్లేషణలు పరంగా నెగటివ్స్ చాలానే ఉన్నా, బన్నీ తన నటనతో ఒంటి చేత్తో సినిమాను ఈ స్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా హిందీలో 30 కోట్లు పైనే కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు కూడా అంచనా వేయలేకపోయారు. హిందీ కలెక్షన్స్ పై ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా మిక్కిలి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ… బన్నీ స్టార్ డంపై ప్రశంసలు కురిపించారు.

అంచనాలకు అందని ఈ ప్రశంసలతో “పుష్ప – ది రూల్” సినిమాను దేశంలోనే అత్యధిక భాషలలో, మునుపెన్నడూ లేని విధంగా విడుదల చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ తో ‘పుష్ప’ యూనిట్ మొత్తం ఎంత ఆనందంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ‘పుష్ప’ యూనిట్ లో ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలను బహుమతిగా ఈ వేడుకలో సుకుమార్ ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories