‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్రకు గానూ అల్లు అర్జున్ పలు అవార్డులను కైవసం చేసుకుంటున్నారు. ‘ఉత్తమ నటుడు’ విభాగంలో కాకపోయినా… విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడిగా ‘స్పెషల్ క్యాటగిరీ’లో బన్నీకి పలు అవార్డులు వస్తున్నాయి. అయితే 2015లో మరో మెగాహీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గోపాల గోపాల’ సినిమాలో మోడ్రన్ కృష్ణుడుగా పవన్ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ లుక్ కు, నటనకు విమర్శకులు కూడా అభినందించారు. సహజంగా సెటిల్డ్ పాత్రలకు దూరంగా ఉండే పవన్, దేవుడి గెటప్ లో మొదటిసారిగా తన స్టైల్ కు విరుద్ధంగా సెటిల్డ్ అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. పవర్ స్టార్ అతిథి పాత్ర వలనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మార్క్ నైనా అందుకోగలిగింది అన్న మాట వాస్తవం.
మరి కనీసం పవన్ ను పరిశీలన కూడా చేయకుండా అల్లు అర్జున్ కు అవార్డు ఇవ్వడమేంటి? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. అన్ని విభాగాల్లోనూ పలువురిని ఎంపిక చేసి అవార్డులను ప్రకటించిన వారు, మరి బన్నీకి మాత్రం ఎలాంటి పోటీ నిర్వహించకుండా ‘స్పెషల్ క్యాటగిరీ’ క్రింద ఇవ్వడాన్ని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి అలాంటి ప్రత్యేక పాత్రలకు అవార్డు ఇవ్వాల్సి వస్తే… “గోపాల గోపాల” సినిమాలో అతిథి పాత్ర పోషించిన పవన్ కే దక్కాలని అంటున్నారు.
సహజంగా ప్రభుత్వాలు ఇచ్చే ‘నంది’ అవార్డులకైతే రీమేక్ సినిమాలకు అవార్డులను ఇవ్వరు. కానీ ప్రస్తుతం అందిస్తున్న ‘సైమా’ వంటి ప్రైవేటు వారికి మాత్రం రీమేక్ అన్న నియమ నిబంధనలు ఏమీ లేవు. దీంతో పవన్ కంటే బన్నీ బెటరా? అన్న ప్రశ్నకు ఊతమిచ్చినట్లయ్యింది. అవార్డు బన్నీ వశం అయినప్పటికీ, పవర్ స్టార్ అభిమానుల మదిలో మాత్రం ‘గోపాలుడే’ మెదులుతున్నాడు.



