సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూర్చొని అన్ని విషయాలు చర్చించుకొని మున్సిపల్ ఎన్నికలలో కూటమిని గెలిపించుకున్నారు.
అయితే ఈ ఎన్నికల్లో కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించిన వ్యక్తి మంత్రి నారా లోకేష్… అనే విషయం వైసీపీకి బాగా అర్ధమైంది.
కానీ నారా లోకేష్‌ని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తే, ఆయన స్థాయిని మరింత పెంచినట్లు అవుతుందనే ఆలోచనతో, కేవలం సీఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తూ సరిపెట్టుకుంది.
అయితే సీట్ల సర్దుబాట్లు, జనసేనలో చేరికల విషయంలో టీడీపీ, జనసేన శ్రేణులు నారా లోకేష్‌ని నిందించడం గమనిస్తే ఆయన తెర వెనుక నుంచే ఈ ఎన్నికలను పర్యవేక్షించారని అర్థమవుతుంది.
జగన్ పదేపదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ వైసీపీకి నష్టం కలిగించుకోగా, ఆయన కంటే వయసులో, రాజకీయ అనుభవంలో చిన్నవాడైన మంత్రి నారా లోకేష్ తెర వెనుకే ఉంటూ కూటమిని గెలిపించుకోవడం విశేషం.
ఇక్కడ ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పుకోవడం అవసరమే. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికలను ప్రభావితం చేయగల మజ్లిస్ పార్టీతో ఆయన ముందుగానే అన్నీ మాట్లాడుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. ఈవిధంగా ముందస్తు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసిన తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారు.
అయన అవలీలగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు. అప్పుడు ‘నాన్నకు ప్రేమతో… కేటీఆర్ కానుక’ అంటూ సోషల్ మీడియాలో డప్పు మోగింది.
కేసీఆర్, కేటీఆర్ కౌగలింతల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం, పాలాభిషేకం ఘట్టాలు ముగిసిన తర్వాత కొడుకుకు మంత్రి పదవిలో ప్రమోషన్స్ కల్పించారు.
కనుక ఆ ఎన్నికలలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నట్లు చెప్పుకున్నా, కేసీఆరే తన కొడుకును గెలిపించుకొని దాని పూర్తి క్రెడిట్ ఆయనకు దక్కేలా చేశారు. తద్వారా కేటీఆర్ ‘చాలా సమర్దుడు’ అని అందరూ భావించేలా చేశారని చెప్పవచ్చు. ఆ విధంగా తండ్రి సాయంతో కేటీఆర్ రాజకీయాలలో మంచి గుర్తింపు సంపాదించుకొని రాణించగలిగారు.
అయితే కొడుకు విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్‌లా వ్యవహరించలేదు. వైసీపీ అవహేళనలు చేస్తున్నప్పుడు, ఆ లోపాలను ఏవిధంగా సరిదిద్దుకోవాలో ఓ తండ్రిగా భోదించారు అంతే! ఆ తర్వాత నారా లోకేష్‌లో ఎంత మార్పు వచ్చిందో అందరూ చూస్తూనే ఉన్నారు.
కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన జిహెచ్‌ఎంసి ఎన్నికలకు మాజీ సిఎం కేసీఆర్ ముందస్తు ఏర్పాట్లు అన్నీ చేసి కొడుకు చేతికి అప్పగిస్తే అది గొప్ప విజయమైతే, ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లాలలో జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికలలో మూడు పార్టీల కూటమిని గెలిపించుకోవడం ఇంకెంత గొప్ప విషయమో కదా?
అయినా నారా లోకేష్ గొప్పలు చెప్పుకోవడం లేదు. తండ్రీకొడుకులు ఫోటోలు దిగలేదు. పాలాభిషేకాలు చేయించుకోలేదు! కనుక ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ‘నాన్నకు ప్రేమతో..’ నారా లోకేష్ ఇచ్చిన అసలైన కానుక’గా భావించవచ్చు
మరో విషయం ఏమిటంటే వైసీపీ అవహేళనలతో సాన పట్టబడిన నారా లోకేష్ ఈ ఎన్నికలలో రాష్ట్ర స్థాయిలో వైసీపీని మట్టి కరిపించారు. తద్వారా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కూడా వైసీపీని ఎదుర్కొని కూటమిని గెలిపించుకోగలరనే నమ్మకం కలిగించగలిగారు. కనుక ఇకపై వైసీపీ మళ్ళీ నారా లోకేష్‌ని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేసినా ఆశ్చేచర్యయం లేదు.
నాన్నకు ప్రేమతో… నారా లోకేష్ కానుక!
Seat Sharing నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు…
Nominations నుంచి Polling వరకు…
అన్నీ తానై చూసుకున్న లోకేష్!ఈ విజయం ఖచ్చితంగా తెర వెనుక ఆయన కృషి ఎంతో ఉంది… ఆయన సామర్థ్యానికి నిదర్శనమే!
#NaraLokesh #APLocalBodyElections https://t.co/wqNjFnbxUD
— M9 NEWS (@M9News_) November 4, 2026





