అల్లు అర్జున్ నేషనల్ అనుకున్నారా…

Allu Arjun Photo on The Hollywood Reporter India

పుష్ప-2 విడుదలైనప్పుడు సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన విషాద ఘటన, తదనంతర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. పుష్ప-2తో అల్లు అర్జున్‌ పేరు యావత్ దేశం, ప్రపంచ దేశాలలో మారుమ్రోగిపోతుంటే, చాలా సంతోషంగా పుష్ప-2 విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవలసిన తరుణంలో అల్లు అర్జున్‌ దాదాపు నెలరోజులు హైదరాబాద్‌లో తన ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టలేకపోయారు.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా అల్లు అర్జున్‌పై నిప్పులు చెరగడం, ఆ కారణంగా సినీ పరిశ్రమపై ఆంక్షలు విధించడం, సంధ్య థియేటర్‌ ఘటన కేసులో పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరగాల్సి రావడం వంటివన్నీ అల్లు అర్జున్‌ జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

ADVERTISEMENT

ఒక ఘన విజయం సాధించిన తర్వాత వరుసగా ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోవడం ఎంతటివారికైనా చాలా బాధ కలిగిస్తుంది. తాను కూడా ఇందుకు అతీతుడిని కానని అల్లు అర్జున్‌ స్వయంగా చెప్పుకున్నారు. అయితే ఈ అనూహ్య పరిణామాలలో అల్లు అర్జున్‌ తప్పిదాలు కూడా ఉన్నాయి. కనుక ఆయన ఎవరినీ నిందించలేరు.

అల్లు అర్జున్‌కి సొంత గడ్డపైన ఇంతగా అవమానం, సమస్యలు, సవాళ్ళు ఎదురవుతుంటే, హాలీవుడ్‌కి చెందిన ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ పత్రిక భారత్‌లో విడుదల చేసిన ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మొదటి ఎడిషన్ కవర్ పేజీపై అల్లు అర్జున్‌ ఫోటోతో కవర్ స్టోరీ ప్రచురించడం అపూర్వమైన గౌరవమే.

ఏవిదంగా అంటే బాలీవుడ్‌తో సహా భారతీయ సినీ పరిశ్రమలో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ వంటి ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన అనేక మంది హేమాహేమీలైన నటీనటులు ఉన్నారు. కానీ కేవలం పుష్ప-1,2తో కొత్తగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ని ఓ విదేశీ పత్రిక తొలి ఎడిషన్ కవర్ పేజీ స్టోరీ కోసం ఎంపిక చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు కదా?

అల్లు అర్జున్‌, ఆయన అభిమానులు ఇంతకాలం అనుభవించిన ఆవేదనకు ఉపశమనంగా, పరిహారంగా లభించిన అపూర్వమైన బహుమతి ఇది అని అనుకోవచ్చు. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పత్రిక ఇటీవలే భారత్‌లో విడుదలైంది.

ADVERTISEMENT
Latest Stories