రేవంత్ రెడ్డి కి గట్టిగానే కౌంటర్ ఇచ్చిన బన్నీ..!

Allu Arjun Press Meet On His Residence

సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో రేవంత్ సర్కార్ vs అల్లు అంటూ కొనసాగుతున్న డైలాగ్ వార్ నేపథ్యంలో అల్లు అర్జున్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గాను బన్నీ ప్రెస్ మీట్ అంటూ ప్రకటించడంతో ఇప్పుడు ఎం జరగబోతుంది, బన్నీ ఏం చెప్పబోతున్నారు అంటూ అటు రాజకీయ పార్టీలతో పాటుగా ఇటు సినీ పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూసారు.

ఈ నేపథ్యంలో బన్నీ స్పందించిన తీరు ‘కర్ర విరగకుండా పాము చావకుండా’ అన్న మాదిరి కొనసాగింది. అటు ప్రభుత్వాన్ని విమర్శించకుండా తానూ చెప్పదలచుకున్న వాదనను బలంగా ప్రజలకు వివరించగలిగారు. అలాగే తన పైన పడిన ప్రతి విమర్శకు కౌంటర్ ఇచ్చారు.

ADVERTISEMENT

రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే తానూ చెప్పదలచుకున్నది చాల స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసారు. అల్లు అర్జున్ ధియేటర్ లో ఉన్నప్పుడే ఆయనకు తొక్కిసలాట ఘటన గురించి చెప్పడం జరిగిందని, అయినా బన్నీ దాన్ని పట్టించుకోకుండా అలానే సినిమా చూస్తున్నాడని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గాను బన్నీ తనకు అలాంటి సమాచారం ఏది పోలీస్ అధికారులు ఇవ్వలేదంటూ బదులిచ్చారు.

అలాగే తానూ ర్యాలీగా వెళ్లినట్టు చేసిన ప్రకటనను కూడా యన ఖండించారు. తన పై తప్పుడు విమర్శలు చేసి తన క్యారెక్టర్ ఏసాసినేషన్ చేసారంటూ చెప్పుకొచ్చారు. పుష్ప సినిమా విజయాన్ని కూడా తాను ఆస్వాదించకుండా ఈ 15 రోజులు ఒంటరిగా గడిపానంటూ తన ఎమోషన్స్ బయటపెట్టారు బన్నీ.

ఇక్కడ బన్నీ ప్రభుత్వం తన పై చేసిన విమర్శలకు తన పిల్లల ప్రస్తావన కూడా తీసుకువచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. దీనితో ప్రభుత్వం తన పైన చేస్తున్నవిమర్శలు అవాస్తవమని తెలియచేసారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఇలా ఒక సెన్సిటివ్ విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత గట్టిగా పట్టుకుందో అటు చిత్ర పరిశ్రమకు ఇటు సామాన్య ప్రేక్షకుడికి అంతు చిక్కడం లేదు.

అలాగే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ అంటూ మీడియా ముందుకొచ్చి తాను చెప్పదలచుకున్న మూడు ముక్కలు చెప్పి కనీసం మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం కూడా కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. లీగల్ ఇష్యూస్ ఉన్నాయంటూ చెప్పి తప్పించుకోవడానికి మీడియా సమావేశం ఎందుకు.? ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోతుందిగా అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఒక్క ఇన్సిడెంట్ కోసం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమనే టార్గెట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది.? బన్నీ ని పరామర్శించిన వారు బాధిత కుటుంబానికి కూడా మద్దతు తెలియచేయొచ్చుగా అన్న రేవంత్ వాదంలోనూ బలం ఉన్నప్పటికీ పరామర్శ, సానుభూతి అనేది ఒకరు అడిగితే చేసేది కాదు. ఒకరు ఆదేశిస్తే ఇచ్చేది కాదు. అది వారి విజ్ఞతకు సంబందించిన అంశం.

రేవంత్ రెడ్డి కూడా హైడ్రా అంటూ పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులను రోడ్ల మీద తెచ్చారు. ఆనాడు కూడా వారు ప్రభుత్వ పెద్దల నుంచి ఓదార్పు, సానుభూతి కోరుకున్నారు. అయినప్పటికీ రేవంత్ మాత్రం ఒక్క అడుగు కూడా ఆదిశగా వేయలేకపోయారు. మరి దీనికి ఎవరిని నిందించాలి. జరిగింది తప్పే, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం తప్ప ఇక్కడ సమస్యకు మరో పరిష్కారం లేదు.

ఇప్పటికే బన్నీ ఇష్యూ తో తెలంగాణ రాజకీయం రెండుగా చీలిపోయింది. అటు బిఆర్ఎస్ అల్లు కు మద్దతుగా నిలిస్తే ఇటు కాంగ్రెస్ టాలీవుడ్ కు వ్యతిరేకంగా గళం విప్పుతుంది. అయితే ప్రభుత్వాలు ఇంత బలంగా టాలీవుడ్ కు వ్యతిరేకంగా, తమ సహా నటుడిని టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో ప్రకటనలు చేసిన నేపథ్యంలో మరి తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి బన్నీకి మద్దతు ప్రకటిస్తుందా..? లేక మౌనాన్నే ఆశ్రయిస్తుందా.?

అయితే అటు ముఖ్యమంత్రి వైల్డ్ కామెంట్స్ ఇటు అల్లు అర్జున్ కౌంటర్ తో ఈ వివాదం ఇక్కడితో ముగుస్తోందా.? లేక ‘AA vs RR ‘ ‘పార్ట్ – 2’ఇది “పుష్ప రైజ్ కాదు రేవంత్ రూల్” అంటూ మరో భాగం తెర మీదకు రానుందా.?

ADVERTISEMENT
Latest Stories