అల్లు అర్జున్ మేక్ ఓవర్… సుక్కు అటెన్షన్ టు డీటెయిల్..

Allu Arjun Pushpa first lookస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. ఇక ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తూ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఒత్తయిన మీసం, గెడ్డం, గుబురు జుట్టుతో అల్లు అర్జున్ రఫ్, మ్యాన్లీ గా కనిపిస్తున్నాడు. ఈ కొత్త గెట్ అప్, మేక్ ఓవర్ అదిరిపోయింది అనే చెప్పుకోవాలి. ఇది ఇలా ఉండగా… ఒక పోస్టర్ లో అల్లు అర్జున్ ఎడమ కాలికి ఆరు వేళ్ళు ఉండటం గమనార్హం. సాధారణ ఫోటో షూట్ లో కూడా సుక్కు చూపించిన అటెన్షన్ టు డీటెయిల్ కు సలాం అనే చెప్పాలి.

ADVERTISEMENT

ఇక ఈ ఎక్సట్రా వేలికి కథకు ఏమైనా కనెక్షన్ ఉంటుందేమో చూడాలి. ఈరోజు సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టారు. బన్నీ, సుక్కు, దేవి శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. లాక్ డౌన్ సడలించబడితే, వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021 లో విడుదల చేయాలనేది ప్రణాళిక.

మహేష్ బాబు – పరశురామ్ చిత్రం మరియు ఎన్టిఆర్ – త్రివిక్రమ్ చిత్రం వంటి సమ్మర్ రిలీజ్ పై కూడా దృష్టి సారించినందున, అల్లు అర్జున్ తన సినిమా విడుదల తేదీని రెగ్యులర్ షూట్ ప్రారంభించిన రోజునే ప్రకటిస్తాడని సమాచారం. ఏప్రిల్ 28/29, 2021 పరిశీలనలో ఉన్న తేదీలు. ప్రభాస్ బాహుబలి 2 ’2017 ఏప్రిల్ 28 న తెరపైకి వచ్చి ట్రెండ్‌సెట్టర్‌గా మారింది. కాబట్టి ఆరోజునే సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట

ADVERTISEMENT
Latest Stories