ట్రైలర్ ఆలస్యానికి కారణం బన్నీ?

Allu arjun reason for pushpa trailer delayఅల్లు అర్జున్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న “పుష్ప” ధియేటిరికల్ ట్రైలర్ పై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు సాయంత్రం 6.03 నిముషాలకు రిలీజ్ కావాల్సిన ట్రైలర్ మూడు గంటలు ఆలస్యంగా విడుదల కావడంతో ఒకింత ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు.

ADVERTISEMENT

అయితే ఈ ఆలస్యానికి కారణం మరెవరో కాదు, ‘పుష్ప’ రోల్ ని పోషిస్తోన్న అల్లు అర్జున్ యేనని ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతున్న సమాచారం. “పుష్ప” ధియేటిరికల్ ట్రైలర్ కట్ బన్నీకి నచ్చకపోవడంతోనే రిలీజ్ ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. అంత షార్ట్ టైంలో చేయగలిగింది కూడా ఏమీ లేకపోవడంతో, మళ్ళీ అదే ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారట.

అంతేకాదు, ఈ ట్రైలర్ విషయంలో చిత్ర యూనిట్ బాధ్యతారాహిత్యం అడుగడుగునా కనపడుతోందని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం రాత్రి 9.18 నిముషాలకు యూట్యూబ్ లో రిలీజ్ చేసిన తెలుగు ట్రైలర్ మంగళవారం ఉదయం నాటికి కూడా పబ్లిక్ కు అందుబాటులోకి రాకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు.

ఎవరైతే నెట్ లో షేర్ చేసుకున్న లింక్ ద్వారా ట్రైలర్ ను చూడగలిగారు గానీ, నేరుగా యూట్యూబ్ కు వెళ్లి ‘పుష్ప తెలుగు ట్రైలర్’ అని వెతికితే, ట్రైలర్ కనిపించని పరిస్థితి. అసలే ఆలస్యంగా తెచ్చిన ట్రైలర్… ఆ పైన గందరగోళం… దానికి తోడు యూట్యూబ్ లో కనిపించని వైనం… ఇదంతా చిత్ర నిర్మాణ సంస్థకు అపఖ్యాతి తీసుకువచ్చే ప్రక్రియగా భావించవచ్చు.

ఎట్టకేలకు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో యూట్యూబ్ సమస్యను పరిష్కరించగలిగారు. ట్రైలర్ ఆశించినంత హైప్ ను తీసుకురాలేని మాట వాస్తవమే గానీ, అలా అని ఈ రెండు నిముషాల ట్రైలర్ సినిమా రిజల్ట్ ను నిర్ణయిస్తుందని చెప్పలేం. గతంలో ఇలాగే “ఫిదా” వంటి సినిమా ట్రైలర్ లు ప్రేక్షకులను మెప్పించకపోయినా, బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories