
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘సరైనోడు’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. స్టైలిష్ స్టార్ మ్యాన్లీ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. హీరోయిజాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించే బోయపాటి బన్నీని కూడా అదే రేంజ్ లో చూపించారని ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్పింది.
ఇక, ఈ సినిమా కోసం నిరీక్షించడమే మెగా ఫ్యాన్స్ వంతు! ఎందుకంటే, ఈ సినిమా విడుదల కాబోయే నెలను చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం’ సినిమాల విడుదల తేదీలు ఖరారు చేసుకున్న ఏప్రిల్ మాసంలోనే అల్లు అర్జున్ “సరైనోడు” ద్వారా సినీ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మరి ఈ సినిమా విడుదలకు అదే సరైన సమయమూ కాదో తెలియాలంటే ఇంకాస్త సమయం ఆగాలి.
ADVERTISEMENT





