బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “సరైనోడు” సినిమా ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను అంతే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. స్థానిక మార్కెట్ తో పాటు యుఎస్ లో కూడా భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మునుపెన్నడూ లేని విధంగా బన్నీ సినిమాకు ఊహించని స్థాయిలో ప్రీమియర్ షోలను ప్రదర్శించబోతున్నారని టాక్. మరి ఇన్ని అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాపై అసలు ఇండస్ట్రీ వర్గాలు ఏమంటున్నాయి… అన్న సందేహం మెగా అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ముందు నుండి హల్చల్ చేస్తున్న సమాచారం మేరకు ప్రజెంట్ టాక్ ఉండడం కాస్త కలవర పెట్టే అంశం. నిజానికి ఫస్ట్ నుండి ‘సరైనోడు’ ఫస్టాఫ్ ఒక రేంజ్ లో ఉందని, సెకండాఫ్ బాగా డల్ అయ్యిందని టాక్ వినపడింది. సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా ఇదే టాక్ వినిపిస్తుండడం విశేషం. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో ఫస్టాఫ్ అదిరిపోయే విధంగా ఉందనే పాజిటివ్ టాక్ ఎలా ఉందో, సెకండాఫ్ బాగా మైనస్ అన్న నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఓ విధంగా రాజమౌళి – ప్రభాస్ ల ‘ఛత్రపతి’ స్థాయిలో టాక్ అయితే హల్చల్ చేస్తోంది.
అయితే పెద్ద సినిమాలు విడుదలవుతున్న సమయంలో ఇలాంటి టాక్ హల్చల్ చేయడం సర్వసాధారణమే కావడంతో మెగాభిమనులు దీనిని లైట్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదలకు ముందు ‘కేక’ ఉందనే టాక్ హల్చల్ చేయడం, విడుదల తర్వాత దానికి పూర్తి విరుద్ధంగా సినిమా ఉండడం చవిచూసిన ఫ్యాన్స్, ‘సరైనోడు’ టాక్ పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయితే “సరైనోడు” విషయంలో మాత్రం మరో “ఛత్రపతి” అన్న టాక్ అయితే బలంగా వినపడుతోంది.



