‘పుష్ప’ ఈవెంట్ : ఈ పేరుకు ఫ్యాన్స్ రియాక్షన్!

'పుష్ప' ఈవెంట్ : ఈ పేరుకు ఫ్యాన్స్ రియాక్షన్!సుకుమార్ – అల్లు అర్జున్ కాంభినేషన్ లో తెరకెక్కిన “పుష్ప” సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిని పురస్కరించుకుని నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆదివారం నాడు బన్నీ అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

ఈ ఈవెంట్ లో చిత్ర హీరో పేరు కాకుండా ఇతర కధానాయకుల పేర్లు కూడా పలువురు ప్రస్తావించారు. చివర్లో స్పీచ్ ఇచ్చిన బన్నీ అయితే “అఖండ” రిలీజ్ మొదలుకుని బాలకృష్ణ పేరుతో పాటు, నాని, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి… ఇలా మరో రెండు నెలల్లో రాబోయే హీరోల పేర్లన్నీ ప్రస్తావించి, ఆయా హీరోల సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.

ADVERTISEMENT

అయితే “పుష్ప” ఈవెంట్ మొత్తానికి సంబంధం లేని పేరును దర్శకుడు వెంకీ లేవనెత్తారు. ఈ పేరు పలకగానే ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన అపూర్వం. ఏ పవన్ కళ్యాణ్ పేరునో ప్రస్తావిస్తే ఈ రేంజ్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ ఉండడం సహజం. కానీ సినిమాలకు సంబంధం లేకుండా ఉన్న ఓ వ్యక్తి, అందులోనూ విదేశీయుడు అయినప్పటికీ ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదు.

అతనే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇటీవల ‘పుష్ప’ గెటప్ వేసుకుని డేవిడ్ వార్నర్ చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అలాగే దీనికి రిప్లై ఇచ్చిన విరాట్ కోహ్లీ స్పందన కూడా వైరల్ అయ్యింది. ఈ విషయాన్నే ‘చలో’ దర్శకుడు పరోక్షంగా ప్రస్తావిస్తూ… “మన తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న డేవిడ్ వార్నర్ గారికి కృతజ్ఞతలు” తెలిపారు.

దీనికి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన అమోఘం. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడిన వార్నర్, తెలుగు సినిమాలతో మమేకం అయిన విషయం తెలిసిందే. గతంలో ‘అలా వైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరూ’ పాటలకు డాన్స్ లు వేసిన వార్నర్, మరికొన్ని పాత తెలుగు సినిమా డైలాగ్స్ పై రీల్స్ కూడా చేసారు. ఈ స్పందన చూస్తే వార్నర్ తో ఓ తెలుగు సినిమా ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదేమో!

ADVERTISEMENT
Latest Stories