పూర్తి నగ్నంగా నటించినా కష్టాలు తప్పలేదు

Amala Paul nude movie Aame release in troubleతెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్. ఆమె నటించిన కొత్త తమిళ చిత్రం ‘ఆడై’. రత్నకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో పూర్తి నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది అమల. ఇలా నటించడానికి అమల పాల్ చేసిన సాహసాన్ని అందరూ పొగుడుతున్నారు. తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా ఉంది. అయితే ఈ సీన్లు తీయడానికి అమల పాల్ చాలా కష్ట పడిందట.

ADVERTISEMENT

దాదాపుగా 20 రోజుల పాటు నగ్నంగా ఉండి ఈ సీన్లు షూట్ చేశారట. తెలుగులో ఆమె అనే పేరుతో ఈరోజే విడుదలకు సన్నాహాలు చేశారు. అయితే సినిమా విడుదల చివరి నిముషంలో వాయిదా పడింది. కొన్ని ఫైనాన్షియ‌ల్ స‌మ‌స్య వ‌ల‌న ఈ చిత్రం నేడు విడుద‌ల కాలేదు. త్వ‌ర‌లో కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. దీనితో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినవారు నిరాశపడ్డారు. ఇదే సమయంలో విక్రమ్ నటించిన మిస్టర్ కెకె చిత్రం ఈరోజు తెలుగు, తమిళ భాషలలో విడుదల అయ్యింది.

అందుతున్న సమాచారం ప్రకారం మిస్టర్ కెకె విక్రమ్ ఖాతాలో మరో డిజాస్టర్ గా నిలిచిపోనుంది. దీనితో నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ కు అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించింది. రెండో రేంజ్ హీరోలలోనే హైయెస్ట్ కలెక్టు చేసింది. ఈ వారాంతానికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. పూర్తి రన్ లో ఏ మేరకు వసూళ్లు రాబడుతుంది అనేది సోమవారం నుండి సినిమా ఆడేదాని బట్టి మనకు తెలుస్తుంది. Amala -Paul at Gemini Labs

ADVERTISEMENT
Latest Stories