గత నెల 31 న దీపావళికి థియేటర్లలో సందడి చేసిన దుల్కర్ ‘లక్కీ భాస్కర్’, కిరణ్ అబ్బవరం ‘క’, సాయి పల్లవి ‘అమరన్’, మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల మెప్పు తో పాటుగా నిర్మాతలకు మంచి వసూళ్లు తెచ్చిపెట్టాయి.
అయితే ఒకే రోజు వెండితెర మీద పోటీపడిన ఈ మూడు సినిమాలు కూడా బుల్లి తెరమీద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘లక్కీ భాస్కర్’, సుజిత్- సందీప్ దర్శకత్వం వహించిన ‘క’ ఈ రెండు సినిమాలు ఈనెల 28 న ఓటిటీ ప్రేక్షకులను పలకరించనున్నాయి.
Also Read – మీడియా వారు జర భద్రం…!
దీవాళికి వచ్చి థియేటర్లలో చిచ్చుబుడ్డి మాదిరి వెలుగులు నింపిన ఈ రెండు చిత్రాలు ఇప్పుడు బుల్లితెర మీద పోటీకి సై అంటున్నాయి. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్ కలిసి నటించిన త్రిల్లర్ ‘క ‘మూవీ ఈ నెల 28 న ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవ్వబోతుంటే, అదే రోజు దుల్కర్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన పీరియాడిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ ‘లక్కీ భాస్కర్’ నెట్ ఫ్లిక్ లో సందడి చేయనుంది.
ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా డబ్బింగ్ మూవీ గా ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన శివ కార్తికేయన్ , సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ కూడా వచ్చే నెల డిసెంబర్ 5 లేదా 11 న నెట్ ఫ్లిక్ ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. అయితే ఈ తేదీ మీద అటు చిత్ర బృందం కానీ, సదరు ఓటిటి సంస్థ కానీ ఇంకా అధికారిక ప్రకటన జారీ చెయ్యలేదు.
Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ
అయితే ఈమూడు సినిమాలలో నటించిన నటి నటులకు అటు ప్రేక్షకుల నుంచి ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. మరి ముఖ్యంగా అమరన్ మూవీ లో సాయిపల్లవి నటనకు అందరు మరోసారి ఫిదా అయ్యారనే చెప్పాలి.
వెండి తెర మీద ప్రశంసలతో పాటుగా కాసుల వర్షాన్ని కురిపించిన ఈ చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని అందుకుని బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించడానికి ఓటిటి కి వేళాయరా అంటూ ముందుకొస్తున్నాయి.